Telugu

Monsoon Diet: వర్షాకాలంలో ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు!

Telugu

అనాస పండు

వర్షాకాలంలో ఖాళీ కడుపుతో ఫైనపిల్ తినకూడదు. ఎందుకంటే, ఇది కడుపులో ఆమ్లత (అసిడిటీ)ను పెంచుతుంది. దాంతో పాటు, కడుపులో మంట, నొప్పి వంటి అసౌకర్యాలు కలుగుతాయి."

Image credits: Getty
Telugu

మామిడి పండు

వర్షాకాలంలో ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తినడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ హఠాత్తుగా పెరిగి, బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే తినేముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

Image credits: Getty
Telugu

ఆరెంజ్

ఖాళీ కడుపుతో ఆరెంజ్ తినకూడదు. ఈ పండులోని సిట్రిక్ యాసిడ్ ప్రభావంతో కడుపు మంట, ఆమ్లత, వాపు కలగవచ్చు. వర్షాకాలంలో ఇది మరింత ప్రభావితం చేస్తుంది.

Image credits: Getty
Telugu

ద్రాక్ష పండు

ద్రాక్షలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాంటి వర్షాకాలంలో ద్రాక్షను ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. 

Image credits: Getty
Telugu

అరటి పండు

వర్షాకాలంలో ఖాళీ కడుపుతో అరటి పండు తినడం వల్ల కడుపులో గ్యాస్,  ఆమ్లత, కడుపు వాపు వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల తినేముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.

Image credits: Getty
Telugu

సపోటా

వర్షాకాలంలో ఖాళీ కడుపుతో సపోటా తింటే, దానిలోని అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందువల్ల ముందు కొద్దిగా ఆహారం తీసుకుని తినడం మంచిది 

Image credits: Getty
Telugu

ముఖ్య గమనిక

బేరి, ఆపిల్ వంటి పండ్లను వర్షాకాలంలో ఖాళీ కడుపుతో తినవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా తినకూడదు.

Image credits: social media

వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారంటే.. సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

Gut Health: పేగులు బాగుండాలంటే.. తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్‌ ఇవే

Non Stick: నాన్‌ స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

వర్షాకాలంలో మారథాన్​ లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇవి తప్పక పాటించండి !