మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చాలా మంది తమ వంటగదిలో రంగురంగుల నాన్‌స్టిక్ పాత్రలను ఉంచడానికి ఇష్టపడతారు. ఈ పాత్రల్లో వంట చేసేటప్పుడు తక్కువ నూనె అవసరం అలాగే చాలా సౌకర్యవంతం.
నాన్‌స్టిక్ పాత్రలు అందం, ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఈ నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఆరోగ్యానికి కూడా తీవ్రమైన హాని కలిగిస్తాయని పరిశోధన చెబుతున్నాయి.
నాన్ స్టిక్ పాత్రల్లో ఆహారం వండడం వల్ల శరీరంలో టెఫ్లాన్ పరిమాణం పెరుగుతుందని, దీని వల్ల శారీరక సమస్యలు ఎదురవుతాయని పలు పరిశోధనల్లో తేలింది.
నాన్‌స్టిక్ ప్యాన్‌లలో సింథటిక్ పాలిమర్‌లు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద టెఫ్లాన్ నుండి విడుదలయ్యే రసాయనాలు ప్రజలలో వంధ్యత్వం , గుండె సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి.
నాన్‌స్టిక్ పాత్రల్లో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఐరన్ లోపంతో పాటు దానికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. నాన్-స్టిక్ పాత్రలపై పూత ఆరోగ్యానికి హానికరం.
నాన్-స్టిక్ పాత్రలను వేడిచేసినప్పుడు, దాని నుండి విడుదలయ్యే రసాయనాలు, విషపూరితమైన పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి.