వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారంటే.. సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
health-life Jun 27 2025
Author: Rajesh K Image Credits:gemini
Telugu
బెర్రీలు
వర్షాకాలంలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే.. ఈ పండ్లు కొందరిలో అలెర్జీ కలిగిస్తాయి. అలాంటి వారు వాటిని తినకూడదు.
Image credits: our own
Telugu
మామిడి పండు
వర్షాకాలంలో తేమగా ఉండటం వల్ల మామిడి పండ్లపై బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పచ్చిగా ఉన్న లేదా రసాయనాలతో పండించిన పండ్లను తినడం మానుకోవాలి.
Image credits: Getty
Telugu
లిచ్చి
లిచీ పండు శరీరానికి మంచిదే, కానీ వర్షాకాలంలో తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ పండులో రసాయనాలు ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తింటే.. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
Image credits: Freepik
Telugu
ద్రాక్ష
వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినే విషయంలో జాగ్రత్త వహించాలి. వీటిని సరిగా శుభ్రం చేయకుండా తినడం వల్ల ఫంగస్ పెరిగే అవకాశం ఉంది.
Image credits: Getty
Telugu
పుచ్చకాయ, కర్బూజ
వర్షాకాలంలో పుచ్చకాయ, కర్బూజ తింటే కొందరిలో జీర్ణ సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ మందకొడిగా ఉంటుంది. కాబట్టి, మోతాదుకు మించి తింటే ఇబ్బంది కలగవచ్చు.
Image credits: Getty
Telugu
వర్షాకాలంలో ఏ పండు తినాలి?
వర్షాకాలంలో ఆపిల్ తినడం మంచిది. దానిలో ఉండే ఫైబర్, విటమిన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.