వర్షాకాలంలో మారథాన్ లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇవి తప్పక పాటించండి !
health-life Jun 26 2025
Author: Rajesh K Image Credits:pexels
Telugu
సరైన షూస్
వర్షాకాలంలో రోడ్లు తడిగా, జారుడుగా ఉంటాయి. అందువల్ల ఈ సీజన్ లో రన్నింగ్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫ్ తో పాటు మంచి గ్రిప్ ఉన్న రన్నింగ్ షూస్ వాడండి. ఇవి మీ పాదాలకు రక్షణ ఇస్తాయి.
Image credits: pexels
Telugu
ఎలాంటి డ్రెస్సింగ్ ?
వర్షాకాలంలో తేలికైన, త్వరగా ఆరే బట్టలు ఎంచుకోవాలి. ముఖ్యంగా రన్నింగ్ సమయంలో సింథటిక్ మెటీరియల్ క్లాత్ డ్రెస్ లను ధరించడం బెటర్.
Image credits: Freepik
Telugu
ఇవి తప్పని సరి
మరాథాన్ సమయంలో వర్షం పడితే లైట్ వాటర్ ప్రూఫ్ రెయిన్ జాకెట్ వాడండి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే.. రన్నింగ్ కూడా అనువుగా ఉంటుంది.
Image credits: Freepik
Telugu
చర్మ సంరక్షణ కోసం
వర్షాకాలంలో చర్మం త్వరగా మెత్తబడుతుంది. వ్యాజిలీన్ లేదా యాంటీ-చాఫింగ్ క్రీమ్ వాడండి. అలాగే.. రన్నింగ్ తరువాత ఫ్రెషప్ అవ్వండి.
Image credits: Freepik
Telugu
నీళ్లు తాగండి
వర్షాకాలంలో మారథాన్ పరుగులో పాల్గొనేటప్పుడు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ప్రతి 20-25 నిమిషాలకు సరిపడినన్ని నీళ్లు తాగండి.
Image credits: Freepik
Telugu
జారే రోడ్లకు దూరంగా
మారథాన్ సమయంలో జిగట మట్టి, నీటితో నిండిన గుంతలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా వెళ్లడం కంటే మెరుగైన మార్గం లేదు.
Image credits: Freepik
Telugu
ముందు నుంచే సిద్ధం కావాలి
మారథాన్‌లో పాల్గొనేవారు వేగంగా, తొందరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఇలా జరగకుండా ముందు నుంచే సిద్ధం కావాలి.
Image credits: Freepik
Telugu
ఆరోగ్యంగా ఉన్నారా?
మారథాన్‌లో పాల్గొనేవారు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ముందు ఓసారి హెల్త్ చెకప్ చేయించుకొని, డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది. ఇలా శారీరకంగా సిద్ధపడినప్పుడే మారథాన్ కు సిద్దమవ్వండి.