కాలేయానికి వాపు వచ్చే స్థితిని హెపటైటిస్ అంటారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, మద్యపానం, కొన్ని మందుల వాడకం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి హెపటైటిస్‌కు కారణం.
Image credits: Getty
Telugu
హెపటైటిస్ లక్షణాలు
జాండీస్, ఆకలి లేకపోవడం, అలసట, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Image credits: Getty
Telugu
2. లివర్ సిర్రోసిస్
కాలేయాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి లివర్ సిర్రోసిస్. ఇది కాలేయంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తుంది. కాలేయ పనితీరును తగ్గేలా చేస్తుంది.
Image credits: Getty
Telugu
లివర్ సిర్రోసిస్ లక్షణాలు
కడుపులో ద్రవం పేరుకుపోవడం, చర్మంలో నిరంతర దురద, జాండీస్, తీవ్ర అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటివి సిర్రోసిస్ లక్షణాలు.
Image credits: Getty
Telugu
3. ఫ్యాటీ లివర్
కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే ఆ వ్యాధిని ఫ్యాటీ లివర్ అంటారు.
Image credits: Getty
Telugu
ఫ్యాటీ లివర్ లక్షణాలు
చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ముఖంలో వాపు, దురద, పొడి చర్మం, ఉదరంలో వాపు, కడుపు ఉబ్బడం, కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Image credits: Getty
Telugu
4. కాలేయ క్యాన్సర్
చాలా త్వరగా వ్యాపించే క్యాన్సర్‌లలో లివర్ క్యాన్సర్ ఒకటి.
Image credits: Getty
Telugu
లివర్ క్యాన్సర్ లక్షణాలు
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, శరీరం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, చర్మం దురద, అధిక అలసట వంటివి లివర్ క్యాన్సర్ సంకేతాలు.
Image credits: Getty
Telugu
గమనిక
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే మీకు మీరుగా వ్యాధిని కన్ఫర్మ్ చేసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించండి. దీని తర్వాత మాత్రమే వ్యాధిని నిర్ధారించుకోండి.