Diabetes: షుగర్ తగ్గాలంటే తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..
health-life Jun 14 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఉలవలు
శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. షుగర్ ఉన్నవారికి ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయి.
దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచే గుణాలు ఉంటాయి.
Image credits: Getty
Telugu
ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఉసిరికాయలో ఉండే పోషకాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
కాకరకాయ
కాకరకాయలో ఉండే చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి మూలకాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాకరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహ రోగులకు మేలు చేస్తుంది.
Image credits: Getty
Telugu
మునగాకు
మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ , ఐసోథియోసైనేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు 10-12 మునగాకులు తీసుకోవడం మేలు.
Image credits: Getty
Telugu
కరివేపాకు
కరివేపాకులో ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.