40 ఏళ్లలో కూడా ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

Health

40 ఏళ్లలో కూడా ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

చర్మం యవ్వనంగా కనిపించాలంటే?

కొల్లాజెన్ వల్ల చర్మం ముడతలు లేకుండా ఉంటుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కానీ 40 ఏళ్ల తర్వాత ఇది తగ్గడం మొదలవుతుంది. అప్పుడు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

విటమిన్ సి

విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉసిరి, నారింజ, నిమ్మ, కివి, బ్రోకలీ, ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో తీసుకోండి.

కొల్లాజెన్-బూస్టింగ్ డైట్

ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం కొల్లాజెన్ పెంచడానికి అవసరం. కాబట్టి గుడ్డు, సోయా, పప్పులు, గింజలు, విత్తనాలు, ఆకుపచ్చ కూరగాయలు తినండి.

ఫేస్ యోగా, మసాజ్

క్రమం తప్పకుండా ముఖానికి మసాజ్, యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాలు ఫేస్ యోగా చేస్తే మంచిది.

సన్‌స్క్రీన్

సూర్యుడి UV కిరణాలు కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. బయటే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ రాయండి.

స్కిన్‌కేర్ ఉత్పత్తులు

రెటినోల్, హయలురోనిక్ యాసిడ్, పెప్టైడ్స్ ఉన్న ఉత్పత్తులు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. కొల్లాజెన్‌ను పెంచుతాయి.

ఒత్తిడి, నిద్ర

ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల కొల్లాజెన్ వేగంగా విచ్ఛిన్నమవుతుంది. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్ర పోవడానికి ప్రయత్నించండి.

షుగర్ పేషెంట్స్ రాత్రి భోజనంలో చేయకూడని తప్పులు ఇవే

Ghee: ఈ సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా నెయ్యి తినకూడదు!

Belly Fat: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే పొట్ట చుట్టున్న కొవ్వు మాయం!

Hair Growth: జుట్టు పొడుగ్గా పెరగాలంటే నిమ్మకాయని ఇలా వాడండి!