చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం లివర్ సిర్రోసిస్ లక్షణం కావచ్చు.
చిన్న గాయాల నుంచి కూడా అధిక రక్తస్రావం అవ్వడాన్ని అశ్రద్ధ చేయకూడదు.
కాలేయం ఉండే కుడివైపు పైభాగంలో అసౌకర్యం, నొప్పి, వాపు సిర్రోసిస్ లక్షణం కావచ్చు.
సిర్రోసిస్ అనేది కాలేయం దెబ్బతినడం వలన వచ్చే వ్యాధి, దీని వల్ల చర్మంపై దురద, దద్దుర్లు రావచ్చు.
పాదాలు, చీలమండలలో వాపు కాలేయ సంబంధిత వ్యాధులకు సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మీ పాదాలలో వాపు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
లివర్ సిర్రోసిస్ లక్షణాల్లో ముదురు రంగులో మూత్రం రావడం, లేత రంగులో మల విసర్జన కూడా ఓ లక్షణం.
బరువు తగ్గడం, వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట కూడా సిర్రోసిస్ లక్షణాలు కావచ్చు.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించండి. వైద్యుల సలహా తర్వాత మాత్రమే వ్యాధిని నిర్ధారించుకోండి.