Health Tips: రోజూ పాలు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
health-life Jun 11 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పోషకాల నిధి
డేటా ప్రకారం.. 240 మి.లీ. పాలలో 149 కేలరీలు, 8 గ్రా, ప్రోటీన్, కొవ్వు, 12 గ్రా, పిండి పదార్థాలు, 24% విటమిన్ D, 28% కాల్షియం, 22% ఫాస్పరస్, 18% విటమిన్ B12, 10% పొటాషియం లభిస్తుంది
Image credits: Getty
Telugu
బలమైన ఎముకలు
పాలలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. క్యాల్షియం ఎముకలకు అవసరమైన ప్రధాన పోషకం, ఫాస్పరస్ ఎముకలను బలంగా, దృఢంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
ప్రోటీన్లు పుష్కలం
200 మి.లీ పాలలో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, యువకులకు రోజువారీ ప్రోటీన్ అవసరం 14% అందిస్తుంది. పాలు కండరాల పెరుగుదలకు, పోషణకు సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యం
పాలులో తక్కువ కొవ్వు, B విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
బరువు నియంత్రణ
పాలులో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలతో సమృద్ధంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అయితే.. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం అవసరం.
Image credits: Pexels
Telugu
జ్ఞాపకశక్తి,
రోజూ పాలు తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది, దృష్టి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే.. వృద్ధాప్యంలో వచ్చే మెదడు క్షీణతను తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
మధుమేహం, క్యాన్సర్ చెక్
ప్రతి రోజు పాలు తాగడం వల్ల మధుమేహం, కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందట. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి రోజు 300mg కాల్షియం తీసుకుంటే కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం 17% వరకు తగ్గింది.