Health
ఎక్కువగా మద్యం సేవించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి మద్యం తాగకపోవడం మంచిది.
ధూమపానం చేసేవారిలో చర్మంపై ముడతలు త్వరగా వస్తాయి. కాబట్టి ధూమపానాన్ని తగ్గించడం మంచిది.
నిద్రలేమి వల్ల శరీరంలో నల్లటి మచ్చలు వస్తాయి. దీనివల్ల ఎక్కువ వయసు కనపడుతుంది. కాబట్టి నిద్ర చాలా అవసరం.
నూనెలో వేయించిన ఆహారాలు, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.
శరీరంలో తగినంత నీరు లేకపోతే ముఖంపై ఎక్కువ వయసు కనపడుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.
వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది.
ఎక్కువ సేపు ఎండలో ఉండటం, సన్‌స్క్రీన్ లోషన్స్ వాడకపోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.