అధిక ఒత్తిడి కండరాల సంకోచానికి దారితీస్తుంది. దీనివల్ల కన్ను అదరడం లాంటి సమస్యలు వస్తాయి.
నిద్ర సరిగ్గా లేకపోయినా, ఎక్కువగా అలసిపోయినా కనురెప్పల కండరాలు బిగుసుకుపోతాయి. దీనివల్ల కూడా కన్ను అదురుతుంది.
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ పానీయాలు లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నాడీ వ్యవస్థ అతిగా ఉత్తేజితం అవుతుంది. ఇది కూడా ఒక కారణమే.
మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఎక్కువసేపు బ్రేక్ లేకుండా చూడటం వల్ల కళ్లపై భారం పడుతుంది. ఇది కండరాల సంకోచానికి దారితీస్తుంది.
శరీరంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B12 లాంటి పోషకాలు తగ్గితే కండరాల సంకోచాలు పెరుగుతాయి. ఇది కూడా కన్ను అదిరడానికి కారణం కావచ్చు.
కళ్లు పొడిబారడం, అలెర్జీలు, గాలి కాలుష్యం వంటివి కూడా కన్ను తరచుగా అదరడానికి కారణమవుతాయి.
కొన్ని రకాల మందులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపేవి కన్ను అదరడానికి కారణం కావచ్చు.
Broccoli Benefits: బ్రకోలీ తింటే ఈ జబ్బులు మీ దరిచేరవు, అవేంటో తెలుసా?
Happy Hormones: హ్యాపీగా ఉండాలా? ఈ 10 ఫుడ్స్ మీట్ డైలో చేర్చుకోండి
Papaya Benefits: బొప్పాయితో బోలెడు లాభాలు.. తెలిస్తే వదలిపెట్టరు
Glaucoma: గ్లకోమా అంటే ఏంటి? కళ్లు పోయేదాకా లక్షణాలు తెలియవు..జాగ్రత్త