Telugu

బ్రకోలీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

చూడ్డానికి చిన్న సైజు కాలీఫ్లవర్‌లా ఉండే బ్రకోలీలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి.

Telugu

గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది

బ్రకోలీని ఆవిరిపై ఉడికించి రోజూ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

రక్తనాళాలకు రక్షణ కవచం

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రకోలీ గుండెకు, రక్తనాళాలకు మేలు చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది

బ్రకోలీలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.

Image credits: Getty
Telugu

కంటి చూపును మెరుగుపరుస్తుంది

వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను బ్రకోలీ నివారిస్తుంది. ముఖ్యంగా రేచీకటి సమస్యను అదుపులో ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బ్రకోలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

Image credits: Asianet News
Telugu

అదుపులో చక్కెర స్థాయిలు

బ్రకోలీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం.

Image credits: Getty

Happy Hormones: హ్యాపీగా ఉండాలా? ఈ 10 ఫుడ్స్ మీట్‌ డైలో చేర్చుకోండి

Papaya Benefits: బొప్పాయితో బోలెడు లాభాలు.. తెలిస్తే వదలిపెట్టరు

Glaucoma: గ్లకోమా అంటే ఏంటి? కళ్లు పోయేదాకా లక్షణాలు తెలియవు..జాగ్రత్త

Jamun Seeds: ఈ గింజలతో షుగర్‌కు చెక్.. బీపీ కూడా కంట్రోల్!