Health

కొబ్బరి నీళ్ళు తాగితే బరువు తగ్గొచ్చా?

కొబ్బరి నీళ్లలో పోషకాలు

ఒక కప్పు అంటే 240 మి.లీ. కొబ్బరి నీళ్లలో 60 కేలరీలు ఉంటాయి.

పిండి పదార్థాలు: 15 గ్రాములు

చక్కెర: 8 గ్రా.

కాల్షియం, మెగ్నీషియం: DVలో 4%

ఫాస్పరస్: DVలో 2%

పొటాషియం: DVలో 15%

హైడ్రేషన్‌కు సహాయపడుతుంది

కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. అలాగే ఆకలి కూడా తగ్గుతుంది. ఎలక్ట్రోలైట్ నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

తక్కువ కేలరీలు

ఇతర పానీయాలతో పోలిస్తే కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంటే కడుపు నిండా కొబ్బరి నీళ్ళు తాగినా మీరు బరువు తగ్గవచ్చు.

జీవక్రియను పెంచుతుంది

శరీర జీవక్రియ పెరిగినప్పుడు కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలోని పొటాషియం, కాల్షియం, విటమిన్ సి జీవక్రియను మెరుగుపరుస్తాయి.

ద్రవ సమతుల్యతను కాపాడుతుంది

కొబ్బరి నీళ్లలో సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి వ్యాయామం సమయంలో శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడుతాయి. అలాగే బరువు తగ్గడానికి సహాయపడతాయి.

కడుపు నిండుగా ఉంటుంది

తినడానికి ముందు కొబ్బరి నీళ్ళు తాగితే ఆకలి తగ్గుతుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి నీళ్ళు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

కొబ్బరి నీళ్లతో బరువు తగ్గడం

మీరు కూడా కొబ్బరి నీళ్లతో బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో నీళ్ళు తాగండి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మీ గుండెకు హాని చేసే ఈ 7 అలవాట్లు వదిలేయండి!

రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా?

ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ బి లోపం ఉన్నట్లే

రాత్రి నిద్ర పట్టడం లేదా... ఇవి తినండి చాలు!