Kitchen Tips: ఈ: ఆకుకూరలను ఇలా క్లీన్ చేయండి.. లేదంటే ప్రమాదమే!
health-life Jun 21 2025
Author: Rajesh K Image Credits:freepik
Telugu
ఉప్పు నీటితో
ముందుగా ఒక టబ్ లేదా పెద్ద గిన్నెలో నీరు తీసుకొని 1-2 స్పూన్ల ఉప్పు వేయండి. ఆ తరువాత ఆకుకూరలను 10-15 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల కీటకాలు, పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి.
Image credits: freepik
Telugu
బేకింగ్ సోడాలో
కూరగాయలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకొని అందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి, అందులో ఆకుకూరలను శుభ్రం చేయాలి.
Image credits: social media
Telugu
పసుపు నీటితో
పసుపు నీటిలో ఆకుకూరలను 5-10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే.. కీటకాలు, పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి.
Image credits: Getty
Telugu
వెనిగర్
ఆకుకూరలను శుభ్రం చేయడానికి వెనిగర్ నీటిని ఉపయోగించవచ్చు. 1 కప్పు నీటికి 1/2 కప్పు వెనిగర్ కలిపి, ఆకుకూరలను 5 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియా తొలగిపోతుంది.
Image credits: social media
Telugu
ఇలా శుభ్రం చేయండి
కొత్తిమీర, పుదీనా వంటివి ఆకుకూరలను శుభ్రమైన వస్త్రంతో తుడవవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకున్న మట్టి, దుమ్ము ధూళిని తొలగించవచ్చు.
Image credits: pexels
Telugu
ఆరబెట్టండి
శుభ్రపరిచిన తర్వాత ఆకులను జల్లెడలో లేదా కాటన్ వస్త్రంపై ఆరబెట్టండి. ఆకులకు తేమ ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.