కొవ్వు తగ్గించడానికి క్రమం తప్పకుండా చియా సీడ్స్ తినవచ్చు. వారంలో తేడాను మీరు గమనించవచ్చు.
ఒక గ్లాసు నీటీలో 2 టీస్పూన్ల చియా సీడ్స్ వేయండి. ఇప్పుడు దానిని 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత దానిలో నిమ్మరసం కలిపి తాగండి.
పెరుగుతో చియా సీడ్స్ కలిపి తినవచ్చు. కావాలనుకుంటే అందులో పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఓట్స్ తో చియా సీడ్స్ కలిపి తీసుకోవచ్చు. తొలుత ఓట్స్ తయారు చేసి, అందులో చియా సీడ్స్ యాడ్ చేసి తీసుకోండి.
చియా పుడ్డింగ్ తయారు చేసుకోండి. పాలు, తేనె, ఇతర పండ్లతో చియా సీడ్స్ కలిపి పుడ్డింగ్ తయారు చేసుకుని తినవచ్చు.
మఫిన్లు, కుకీలు లేదా రొట్టె తయారు చేసేటప్పుడు చియా సీడ్స్ ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇది తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం .
సలాడ్ లేదా కూరగాయలపై చియా సీడ్స్ చల్లుకోండి. ఈ విధంగా చియా సీడ్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచింది.
బరువు తగ్గాలనుకుంటే క్రమం తప్పకుండా చియా సీడ్స్ తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే తప్పులు అస్సలు చేయకండి!
ఇలా చేస్తే.. విరాట్ కోహ్లి లాంటి ఫిజిక్ మీ సొంతం..
Weight Gain: ఈ ఫుడ్ తింటే త్వరగా బరువు పెరుగుతారంట..
దంతాలను బలంగా మార్చే పుడ్.. మీరు కూడా ట్రై చేయండి