Chest Pain: ఛాతినొప్పి అంటే హార్ట్ఎటాక్ ఒక్కటే కాదు.. ఇవి కూడా కారణాలే
health-life May 21 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
నెలసరి సమస్యలు
నెలసరికి ముందు లేదా నెలసరి సమయంలో ఛాతీ నొప్పి రావచ్చు. ఇది సాధారణమే అయినా కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది.
Image credits: Getty
Telugu
హార్మోన్ల పై ప్రభావం
హార్మోన్లు ఛాతీపై ప్రభావితం చూపి నొప్పికి కారణం కావచ్చు. ముఖ్యంగా ఋతుస్రావం సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు మారడం వల్ల ఛాతీ నొప్పిగా, వాపుగా మారవచ్చు.
Image credits: Getty
Telugu
ఛాతీలో గడ్డ
ఛాతీలో గడ్డ ఉన్నప్పుడు నొప్పి రావడం సాధారణం కాదు. వెంటనే వైద్యుడిని సంప్రదించటం చాలా ముఖ్యం. ఛాతీలో గడ్డ ఉంటే అది క్యాన్సర్ కూడా కావచ్చు.
Image credits: pexels
Telugu
జీర్ణ సమస్యలు
జీర్ణ సమస్యల వల్ల కడుపు ఉబ్బరం మారి, అది ఛాతీ నొప్పికి కూడా దారితీయవచ్చు. జీర్ణ వ్యవస్థలో గ్యాస్ పేరుకుపోవడం, మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉంటే ఛాతీ నొప్పి రావొచ్చు.
Image credits: Getty
Telugu
డాక్టర్ సలహా
ఛాతీ నొప్పికి చాలా కారణాలున్నాయి. డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.