Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా ? డైట్‌లో ఈ ఫుడ్ చేర్చుకోండి!
health-life Jul 29 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
గుడ్లు
వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే మీ డైట్‌లో గుడ్లు తప్పనిసరిగా చేర్చండి. గుడ్లలో ఉన్న అధికమైన ప్రోటీన్ జుట్టుకు బలాన్ని అందించి, రాలే సమస్యను తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
కీర
వర్షాకాలంలో జుట్టు బలహీనమవుతోందా? కీర తినడం వల్ల జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్ ఎ, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి.
Image credits: stockPhoto
Telugu
చిలగడదుంప
వర్షాకాలంలో జుట్టు రాలుతుంటే.. చిలగడదుంపను మీ ఆహారంలో చేర్చండి. ఇందులో ఉండే విటమిన్ A జుట్టుకు బలాన్ని ఇస్తుంది.
Image credits: Getty
Telugu
చేపలు
జుట్టు ఆరోగ్యానికి చేపలు మేలు చేస్తాయి. వర్షాకాలంలో ఇవి తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి, జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.
Image credits: Getty
Telugu
కూరగాయలు
వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి పచ్చి కూరగాయల రసాన్ని తరుచుగా తీసుకోండి.
Image credits: Getty
Telugu
పెరుగు
జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే.. పెరుగును మీ డైట్ లో చేర్చుకోండి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం ఉండటం వల్ల అవి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.
Image credits: Pinterest
Telugu
చిరుధాన్యాలు
చిరుధాన్యాల్లో ఐరన్, మెగ్నీషియం, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.