Health
పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
టమాటా జ్యూస్ లో విటమిన్ సితో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి జ్యూస్ ను మీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
టమాటా జ్యూస్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హై బీపీని తగ్గించంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
టమాటాలో ఉండే లైకోపీన్ మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్ప్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
టమాటా జ్యూస్ డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
టమాటా జ్యూస్ ను మీరు పరిగడుపున తాగితే మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.