Health

హాస్పటల్ కు వెళ్లినప్పుడు నాలుకను ఎందుకు చూస్తారో తెలుసా

నాలుక రంగు

హాస్పటల్ కు వెళ్లినప్పుడు డాక్టర్ ఖచ్చితంగా నాలుకను చూస్తాడు. అసలు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? 

నాలుక రంగు ఏం చెప్తుంది

మన నాలుక రంగు చాలు మనకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో తెలుసా? అసలు నాలుక ఏ రంగులో ఉండే ఎలాంటి సమస్యలు ఉన్నట్టో తెలుసా? 

లేత గులాబీ రంగు

మీ నాలుక లేత గులాబీ రంగులో ఉంటే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. దానిపై సన్నని తెల్లటి పొర కూడా ఉంటుంది, ఇది సర్వ సాధారణం.

తెల్లటి నాలుక

కొంతమంది నాలుక తెల్లగా ఉంటుంది. అది డీహైడ్రేషన్ లేదా నోటి పరిశుభ్రత లేకపోవడాన్ని సూచిస్తుంది. అలాగే తెల్లటి పొర మందంగా ఉంటే ల్యూకోప్లాకియా లేదా ఫ్లూ మీకు ఉన్నట్టు. 

 

మసకబారడం

మీ నాలుక రంగు మసకబారినట్టుగా కనిపిస్తే మీ శరీరంలో పోషకాల లోపం ఉన్నట్టు.  ఇది సరికావాలంటే మీరు మంచి పోషకాహారం తింటే సరిపోతుంది.

పసుపు నాలుక

పసుపు పచ్చ నాలుక జీర్ణ సమస్యలను సూచిస్తుంది. అంతేకాదు కాలేయం లేదా కడుపు సమస్యలుంటే కూడా నాలుక ఈ రంగులోకి మారుతుంది. 

గోధుమ-నలుపు నాలుక:

గోధుమ రంగు నాలుక, కాఫీ కలర్ నాలుకకు స్మోకింగ్ కారణం కావొచ్చు. దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసేవారికి నాలుక గోధుమ రంగులోకి మారుతుంది. నల్లగా కూడా మారే అవకాశం ఉంది.

ఎర్రని నాలుక

ఎర్రని నాలుక ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి-12 లోపానికి సంకేతం కావొచ్చు. 

నీలం లేదా ఊదా రంగు నాలుక

నీలం లేదా ఊదా రంగు నాలుక గుండె సమస్యలను సూచిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అంటే మీ గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయడం లేదని అర్థం. 

Find Next One