Milk: రోజూ రాత్రి పాలు తాగితే.. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా ?
health-life Jun 22 2025
Author: Rajesh K Image Credits:FREEPIK
Telugu
నిద్రలేమికి చెక్
గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్యను పరిష్కరం. పాలలో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ అనే పదార్థాలు నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.
Image credits: FREEPIK
Telugu
మెరుగైన జీర్ణక్రియ
పడుకునే ముందు వేడి పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఉపశమనం కలిగి, మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది.ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్ర, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది
Image credits: FREEPIK
Telugu
ఆరోగ్యానికి ఎంతో మేలు
పాలలో కాల్షియం, ప్రోటీన్లతో పాటు శరీరానికి ఎంతో అవసరమైన ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Image credits: FREEPIK
Telugu
ఆకలిపై నియంత్రణ
పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల రాత్రిపూట ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు ఉండటం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
Image credits: Freepik
Telugu
కాంతివంతమైన చర్మం
పలు అధ్యయనాల ప్రకారం.. పాలలో ఉండే పోషకాలు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి దోహదపడతాయి. ముఖ్యంగా లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
Image credits: Freepik
Telugu
విశ్రాంతి
రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతుంది. పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
Image credits: FREEPIK
Telugu
గమనిక
లాక్టోస్ అసహనం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పాలు తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి.