Health

బీట్ రూట్ ను తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

కాలేయ ఆరోగ్యం

బీట్ రూట్ ను రోజూ తినడం అలవాటు చేసుకుంటే మీ కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ మీ కాలెయంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.

Image credits: Getty

అధిక రక్తపోటు

బీపీ పేషెంట్లకు బీట్ రూట్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

డయాబెటిస్

బీట్‌రూట్‌ షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

Image credits: Getty

జీర్ణక్రియ

బీట్ రూట్ జీర్ణక్రియను మెరుగుపర్చానికి కూడా సహాయపడుతుంది.ఒక కప్పు బీట్‌రూట్‌లో 3.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 

Image credits: Getty

రక్తహీనత

ఒంట్లో రక్తం పెంచడానికి కూడా బీట్ రూట్ సహాయపడుతుంది. ఈ కూరగయాలో ఐరన్ మెండుగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్నవారు బీట్ రూట్ ను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునేవారికి కూడా బీట్ రూట్ సహాయపడుతుంది. దీనిలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే మీరు ఈజీగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

చర్మం

బీట్ రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

సబ్జా నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా

డయాబెటీస్ ఉన్నవారికి ఈ పండ్లు విషం లాంటివి

హై బీపీని తగ్గించే 6 నేచురల్ డ్రింక్స్ ఇవిగో

పిల్లలకు గుండెపోటు ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి