Health
ఖాళీ కడుపుతో లవంగం నీటిని తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
షుగర్ పేషెంట్స్ రోజూ ఉదయం ఈ నీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇందులోని ఔషధ గుణాలు డయాబెటిస్ బాధితులకు ఉపయోగపడతాయి.
లవంగం నీటిని తాగితే నోటి దుర్వాసన దూరమవుతుంది. ఇందులోని విటమిన్ ఏ, సీ, ఈతో పాటు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతాయి. దంతాల సమస్యలు తగ్గుతాయి.
ఇందులోని పోషకాలు విలువలు శరీరంలోని ట్యాక్సీన్లను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో లివర్, కిడ్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
లవంగం నీటిని రోజూ తీసుకుంటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రావు.
లవంగాల్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతాయి. దీంతో చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.
పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.