Health
తగినంత నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్లు వస్తాయి. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
ఉప్పు ఎక్కువ వాడితే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే భోజనంలో ఉప్పు తగ్గించాలి.
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. బరువు తగ్గితే కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుకోవచ్చు.
తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, మాంసం ఎక్కువ తింటే రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
మందులు ఎక్కువగా వాడటం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయి.
కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
వ్యాయామం చేయకపోయినా కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.