గోరువెచ్చని నీళ్లలో సగం నిమ్మరసం, తేనెను వేసి కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం తగ్గుతుంది. మీ కాలెయ పనితీరు మెరుగుపడుతుంది.
దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి మగ్గు వాటర్ లో వేయండి. దీనిలోనే ఫ్రెష్ పుదీనా ఆకులను వేసి గంటపాటు పక్కన పెట్టి తర్వాత తాగండి. ఈ వాటర్ ను తాగితే మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.
గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో టీ స్సైన్ ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్, తేనెను వేసి కలపండి. దీన్ని భోజనానికి 15 నుంచి 20 నిమిషాల ముందు తాగాతే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కొన్ని నీళ్లలో అల్లం ముక్కలను వేసి 10 నిమిషాలు ఉడికించండి. దీనిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగండి. ఇది పేగుల్లో మంటను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
ఇందుకోసం గ్లాస్ నీళ్లలో ఫ్రెష్ కలబంద జెల్ ను కొంచెం నిమ్మరసం వేసి కలపండి. అలొవేరా జెల్ సహజ భేదిమందుగా పనిచేస్తుంది. దీన్ని తాగితే మంట తగ్గుతుంది.
గ్లాస్ వాటర్ లో టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే తాగండి. ఇది కడుపు ఉబ్బరం, వాయువు, తిమ్మిరిని తగ్గిస్తుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.
గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.