Salt Benefits: కేవలం రుచికే కాదు.. ఉప్పుతో బోలెడు ప్రయోజనాలు
health-life Jul 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
క్రీమి, కీటకాలకు చెక్
ఉప్పుతో ఇంట్లోకి వచ్చే చీమలు, చిన్న కీటకాలను తరిమికొట్టవచ్చు. చీమలు వచ్చే మార్గాల్లో కాస్త ఉప్పు చల్లితే అవి పారిపోతాయి. ఇది ఖర్చు లేని, హానికరం కాని సహజమైన నివారణ మార్గం.
Image credits: Getty
Telugu
వంట పాత్రల శుభ్రత
వంట పాత్రలను ఉప్పుతో సులభంగా శుభ్రం చేయవచ్చు. పాత్రలను నీటితో కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు చల్లి నెమ్మదిగా రుద్దితే జిడ్డు మరకలు కూడా పోతాయి.
Image credits: Getty
Telugu
చేతులు కడుక్కోవచ్చు
ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి కోసిన తర్వాత చేతుల్లో ఉండే దుర్వాసనను ఉప్పుతో సులభంగా తొలగించవచ్చు. కొద్దిగా ఉప్పును చేతుల్లో వేసుకుని నెమ్మదిగా రుద్ది, శుభ్రంగా కడిగితే వాసన పోతుంది.
Image credits: Getty
Telugu
కలుపు నివారిణి
తోటలో పెరిగే గడ్డి, మొక్కలను ఉప్పుతో తొలగించవచ్చు. నీరు లేదా వెనిగర్ లో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మొక్కలపై స్ప్రే చేస్తే చాలు. అవి కొద్దికాలంలో చనిపోతాయి. ఇదోక కలుపు నివారణ పద్దతి.
Image credits: Getty
Telugu
బట్టల మరకలు తొలగింపు
బట్టలపై ఉన్న మరకలను తొలగించేందుకు ఉప్పు మంచి సహజ పరిష్కారం. కాసేపు నీటిలో బట్టలను నానబెట్టి, మరక ఉన్న చోట కొద్దిగా ఉప్పు చల్లి నెమ్మదిగా రుద్దితే మరకలు పోతాయి.
Image credits: Getty
Telugu
దుర్వాసన దూరం
ఇంట్లో చెత్త వల్ల వచ్చే దుర్వాసనను తొలగించేందుకు ఉప్పు ఉపయోగపడుతుంది. ఉప్పుతో పాటు కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి దుర్వాసన వస్తున్న ప్రదేశాల్లో వేసి శుభ్రం చేస్తే వాసన రాదు.
Image credits: Getty
Telugu
బాత్రూమ్ శుభ్రం
బాత్రూంలోని మరకలు, మురికిని తొలగించేందుకు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉప్పు, డిష్ వాష్ కలిపి రుద్ది కడిగితే బాత్రూమ్ శుభ్రంగా మారుతుంది.