Telugu

Bad Breath: రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాసన వస్తుందా? కారణాలివే..

Telugu

నీళ్ళు తాగకపోవడం

తగినంత నీరు తాగకపోవడం నోటి దుర్వాస‌నకు ఓ కారణం.  నీరు తాగకపోవడం వల్ల నోరు ఎండిపోతుంది, ఫలితంగా లాలాజల ఉత్పత్తి తగ్గి, నోటిలో బాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి తరుచుగా నీటి తాగాలి. 

Image credits: Getty
Telugu

నోటి శుభ్రత లోపం

తిన్న తర్వాత సరిగ్గా నోరు శుభ్రం చేసుకోకపోతే ఆహారపు అవశేషాలు నోటిలో ఉండిపోతాయి. దీంతో నోటిలో బాక్టీరియాను పెరిగి, దుర్వాసన వస్తుంది.

Image credits: Getty
Telugu

ఆహారపు పదార్థాలు

వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి కొన్ని ఆహారపదార్థాలను అధికంగా తీసుకోవడం. ఈ ఆహారపదార్థాలు జీర్ణమైన తర్వాత రక్తంలోకి ప్రవేశించి, శ్వాసతో బయటకు వస్తాయి.  

Image credits: Getty
Telugu

ధూమపానం

ధూమపానం వల్ల నోరు ఎండిపోవడం, లాలాజలం తగ్గిపోతుంది. అలాగే పొగలోని రసాయనాలు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. 

Image credits: Getty
Telugu

మద్యపానం

మద్యపానం వల్ల నోరు ఎండిపోవడంతో పాటు శరీరంలో ఉన్న ఆల్కహాల్ వాసన ఊపిరి ద్వారా బయటికి వస్తుంది. మద్యపానం వల్ల నోటిలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా దెబ్బతిని, దుర్వాసన వస్తుంది. 

Image credits: Getty
Telugu

వివిధ వ్యాధులు

నోటిలో దంతాలు, నాలుకపై వచ్చే వ్యాధులు మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాలకు వచ్చిన సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.  

Image credits: Getty
Telugu

రాత్రి బ్రష్ చేయకపోవడం

రాత్రి భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయడం చాలా అవసరం. లేదంటే పళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆహార అవశేషాల వల్ల బాక్టీరియా పెరిగే దుర్వాసన వచ్చే పరిస్థితి ఉంది.  

Image credits: Getty

Salt Benefits: కేవలం రుచికే కాదు.. ఉప్పుతో బోలెడు ప్రయోజనాలు

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్టే!

Monsoon Diet: వర్షాకాలంలో ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు!

వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారంటే.. సమస్యలు తెచ్చుకున్నట్టేనట!