చిలగడదుంపలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ తో పాటు బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.
చిలగడదుంపలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి.. మెరుగైన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.
అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే పొటాషియం.. చిలగడదుంపలో ఉంటుంది.
చిలగడదుంపలో కేలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
చిలగడదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది.
చిలగడదుంపలోని ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చిలగడదుంపలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.
చిలగడదుంపలో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడతాయి.
చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది.
Health Tips: టీతో పాటు ఈ స్నాక్స్ అస్సలు తినొద్దు.. ఎందుకో తెలుసా?
Moringa Water: రోజూ ఉదయాన్నే మునగాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Chia Seeds: చియా సీడ్స్ ని ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే ఏమౌతుందో తెలుసా?