Moringa Benefits: మునగాకు పొడితో ఇన్ని లాభాలా.. మీరు కూడా ట్రై చేయండి
Telugu
పోషకాల నిధి
మునగాకు పొడిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందులో విటమిన్ ఎ, సి, బి1, బి2, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం ఉంటాయి.
Telugu
రోగనిరోధక శక్తి
మునగాకు పొడిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఇనుము, జింక్ వంటివి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Telugu
బ్లడ్ షుగర్ నియంత్రణ
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఐసోథియోసైనేట్ (isothiocyanate) వంటి సమ్మేళనాలు మునగలో ఉన్నాయి.
Telugu
జీర్ణ సమస్యలకు చెక్
మునగాకు పొడి ఆరోగ్యకరమైన ప్రేగుల మైక్రోబయోమ్‌ను కాపాడుతుంది. ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిటిస్ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Telugu
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
మునగాకు పొడిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
Telugu
మెదడు ఆరోగ్యం
మునగాకు పొడిలో మెదడుకి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Telugu
ఎముకల రక్షణ
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల మునగాకు పొడి ఎముకల ఆరోగ్యానికి మంచిది.