ఆస్తమా ఉన్న వారు బేకరీ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఆ ఐటమ్స్ లో ఫ్లేవర్డ్ షుగర్ కలుపుతారు. ఇది మీకు అస్సలు మంచిది కాదు.
ఆస్తమా ఉన్న వాళ్లు వెన్నతో జాగ్రత్తగా ఉండాలి. వాడిన వెన్న మళ్ళీ వేడి చేసి తింటే ఊపిరితిత్తులకు మంచిది కాదు.
ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా ఆస్తమా రోగులు అస్సలు తినకూడదు.
ఆస్తమా రోగులు సోడా/కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. పిల్లల్లో ఆస్తమా కి ఇవే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
అతి చల్లని పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ పిల్లల శ్వాసకోశాలను దెబ్బతీస్తాయి. వీటి వల్ల 7-9 ఏళ్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ.
ఆస్తమా రోగులు పాలు, ఐస్ క్రీం, పెరుగు, చీజ్ లాంటివి తినకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వస్తాయి.