Foods for Liver: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!
Telugu
ఆకుకూరలు
పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కెతో పాటు మరెన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి.
Telugu
క్రూసిఫెరస్ కూరగాయలు
బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, కాలే, బ్రస్సెల్స్ మొలకలు మొదలైన వాటిని క్రూసిఫెరస్ కూరగాయలు అంటారు. వీటిలో ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
Telugu
బెర్రీ పండ్లు
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Telugu
కొవ్వు చేపలు
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన సాల్మన్ వంటి కొవ్వు చేపలు లివర్ ఆరోగ్యానికి మంచివి. ఈ చేపలు కాలేయంలో కొవ్వును, వాపును తగ్గిస్తాయి.
Telugu
ఆలివ్ నూనె
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆలివ్ నూనె కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది.
Telugu
డ్రై ఫ్రూట్స్
బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, కాలేయ వ్యాధుల సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
Telugu
కాఫీ
లివర్ ఆరోగ్యానికి కాఫీ తాగడం కూడా మంచిది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు, కాలేయ కణాలను రక్షిస్తాయి. కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి,