బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో వినెగర్, నీరు కలిపి స్ప్రే చేయండి. వినెగర్ ఘాటైన వాసన వల్ల బల్లులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాయి.
బల్లులు ఎక్కువగా వచ్చే చోట పెప్పర్ స్ప్రే చల్లండి. లేదా మిరియాలు, కారం పొడిని నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయల ఘాటైన వాసన బల్లులకు నచ్చదు. కాబట్టి ఉల్లిపాయలు, వెల్లుల్లిని నూరి నీటిలో కలిపి స్ప్రే చేస్తే బల్లులు రావు.
కాఫీ పొడి ఘాటైన వాసన బల్లులకు ఇష్టం ఉండదు. బల్లులు తరుచు కనిపించే ప్రదేశాల్లో కాఫీ పొడి చల్లితే సరిపోతుంది.
బల్లులకు గుడ్డు పెంకుల వాసన ఇష్టం ఉండదు. కాబట్టి బల్లులు తిరిగే చోట గుడ్డు పెంకులు ఉంచితే వాటి బాధ తగ్గుతుంది.
బల్లులను తరిమికొట్టడానికి పుదీనాను ఉపయోగించవచ్చు. ఇంట్లో పుదీనా మొక్కలు పెంచితే బల్లులు రాకుండా ఆపవచ్చు.
బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో వినెగర్, నీరు కలిపి స్ప్రే చేయండి. వినెగర్ ఘాటైన వాసన వల్ల బల్లులు ఆ ప్రాంతానికి దగ్గరగా కూడా రావు.