Health

గోర్లను కొరికితే ఏమౌతుందో తెలుసా?

Image credits: Pexels

అంటువ్యాధులు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గోర్లను కొరికితే అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే గోర్లలో ఉండే బ్యాక్టీరియా గాయాల ద్వారా శరీరంలోకి వెళ్లి పారోనిచియా వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

Image credits: Freepik

దంతాలకు నష్టం

గోర్లను కొరికే అలవాటు వల్ల మీ పళ్లు కూడా దెబ్బతింటాయి తెలుసా? గోర్లను కొరికితే దంతాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో పళ్లు విరగడం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: pinterest

చిగుళ్లు దెబ్బతింటాయి

గోర్లను కొరికితే ఒక్క దంతాలు దెబ్బతినడమే కాదు.. చిగుళ్లుకూడా దెబ్బతింటాయి. దీనివల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. 

Image credits: Getty

గోర్ల నష్టం

గోర్లను కొరకడం వల్ల మీ గోర్ల బలం తగ్గుతాయి. దీనివల్ల అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే గోర్లు పెళుసులుగా కూడా అవుతాయి. 

Image credits: Getty

జెర్మ్స్ వ్యాప్తి

మీకు తెలుసా? మన గోర్లలో రకరకాల బ్యాక్టీరియాలు, ఫంగస్ లు, వైరస్ లు ఉంటాయి. ఇవి మనం గోర్లను కొరకడం వల్ల నోట్లోకి వెళ్లి ఎన్నో జబ్బుల బారిన పడేస్తాయి. 

Image credits: Getty

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

గోర్లను కొరకడం వల్ల ఒక్క శారీరక ఆరోగ్యమే కాదు..మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. గోర్లను కొరకడం యాంగ్జైటీ, స్ట్రెస్ లేదా ఉద్రిక్తతకు సంకేతం కావొచ్చు.

Image credits: Freepik

రాత్రిపూట బ్లడ్ షుగర్ పెరిగితే ఏమౌతుందో తెలుసా

లివర్ క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు ఇవి: వీటిని తప్పక తెలుసుకోండి

పాలలో పసుపు కలుపుని తాగితే ఏమౌతుందో తెలుసా

ఏం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసా