Oregano: దివ్య ఔషధ మూలిక ఒరెగానో.. ఈ మొక్కను పెరట్లో పెంచుకోండిలా..
gardening Jul 19 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ప్రత్యేకత
ఒరెగానో..దీనిని వామజ్జిక లేదా అడవి మర్జోరమ్ అని కూడా పిలుస్తారు. ఈ ఒరెగానోను స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, అమెరికాలో ఎక్కువ సాగు చేస్తారు. రుచి కారంగా, కొద్దిగా చేదుగా ఉంటుంది
Image credits: Getty
Telugu
సరైన నేల
ఒరెగానో ఎలాంటి మట్టిలోనైనా పెరుగుతుంది. మంచి నీటిపారుదల ఉండే మట్టిలోనే మెరుగుగా వృద్ధి చెందుతుంది. గార్డెన్ సాయిల్‌లో కొద్దిగా కంపోస్ట్, ఇసుక కలిపి నాటితే మొక్క త్వరగా పెరుగుతుంది
Image credits: Getty
Telugu
జాగ్రత్తలు
ఒరెగానో విత్తనాలు నాటిన తర్వాత మట్టితో కప్పి, తేలికగా నీరు చిలకరించాలి. మొక్క నాటుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కింది ఆకులను కత్తిరించిన తర్వాత మాత్రమే మొక్కను నాటాలి.
Image credits: Getty
Telugu
సరైన వాతావరణం
ఒరెగానో వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఈ మొక్కకు రోజుకు కనీసం 6 గంటల సూర్యకాంతి అవసరం. తక్కువ వెలుతురులో ఎదుగుదల మందగిస్తుంది.
Image credits: Getty
Telugu
నీరు
ఈ ఔషద మొక్కకు ఎక్కువ నీరు అవసరం లేదు. మట్టిలో తేమ లేనప్పుడు మాత్రమే నీరు పోయాలి.
Image credits: Getty
Telugu
ఇలా చేస్తే త్వరగా
ఈ మొక్క 6 అంగుళాల ఎత్తుకు పెరిగినప్పుడు కత్తిరించాలి. ఇది మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
కీటకాల నియంత్రణ
ఒరెగానో మొక్కకు సహజంగా కీటకాలను తరిమికొట్టే గుణం ఉన్నా, కొన్నిసార్లు అఫిడ్స్, స్పైడర్ మైట్స్ వంటి కీటకాలు దాడి చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వేపనూనె స్ప్రే చేస్తే చాలు.