Telugu

Henna Plant: చిన్న కొమ్మతో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!

Telugu

విత్తనాల అవసరం లేదు..

గోరింటాకు మొక్క పెంచడం అంత సులువు కాదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ, విత్తనాల అవసరం లేకుండా చిన్న కొమ్మ ఉన్నా చాలు ఈజీగా పెంచేయచ్చు. 

Image credits: instagram
Telugu

వాతావరణం ఎలా ఉండాలి?

గోరింటాకు మొక్కకు మంచి ఎండ తగలాలి. 19 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో ఈ మొక్క బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతారు.

Image credits: instagram
Telugu

మొక్కను ఎలా నాటాలి?

గోరింటాకు కొమ్మను కట్ చేసి నాటితే మొక్క బాగా పెరుగుతుంది. వర్షాకాలంలో లేదా ఫిబ్రవరి నెలలో కొమ్మలను కట్ చేయడం మంచిది.

Image credits: instagram
Telugu

ట్రిమ్మింగ్ అవసరం

గోరింటాకు మొక్కను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. అప్పుడే అది గుబురుగా, ఏపుగా పెరుగుతుంది.

Image credits: instagram
Telugu

ఏమేం కలపాలి?

మట్టి, కోకోపీట్, కంపోస్ట్.. ఈ మూడింటినీ సమాన భాగాలుగా తీసుకోవాలి. ఈ మిశ్రమంలో మొక్క బాగా పెరుగుతుంది.

Image credits: instagram
Telugu

కలబంద గుజ్జు

కట్ చేసిన గోరింట కొమ్మను కలబంద గుజ్జులో ముంచి నాటాలి. ఇది సహజమైన రూటింగ్ హార్మోన్‌లా పనిచేసి, వేర్లు త్వరగా రావడానికి సాయపడుతుంది.

Image credits: instagram
Telugu

నీళ్లు ఎక్కువగా పోయొద్దు

కుండీలో గోరింటాకు మొక్కను పెంచుతున్నప్పుడు నీళ్లు ఎక్కువగా పోయకూడదు. మట్టి తేమగా ఉంటే చాలు, నీళ్లు నిలిచిపోతే వేళ్లు కుళ్లిపోతాయి.

Image credits: instagram
Telugu

ఆకులను కట్ చేయాలి

మొక్కపై ఉన్న ఆకులను ఎప్పటికప్పుడు కట్ చేయకపోతే, అవి పసుపు రంగులోకి మారిపోతాయి. మొక్క పెరుగుదల కూడా ఆగిపోతుంది.

Image credits: instagram

Tulsi Plant: గింజలు ఇలా చల్లినా తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది

Curry Leaves: ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది!

Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో తెలుసా?