Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి
gardening Jul 09 2026
Author: Nandini Arava Image Credits:AI Image
Telugu
కూరగాయల తొక్కలు
బంగాళదుంప, ఉల్లిపాయ, దోసకాయ, క్యారెట్ లాంటి కూరగాయల తొక్కల్ని అస్సలు పడేయకండి. వీటిని మట్టిలో కలిపితే, అవి కుళ్లిపోయి మొక్కలకు కావాల్సిన సహజ పోషకాలను అందిస్తాయి.
Image credits: chatgpt AI
Telugu
వాడిన టీ పొడి (Used Tea Powder)
మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే, వాడేసిన టీ పొడి లేదా టీ ఆకులను వాడొచ్చు. ఇందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మట్టి సారాన్ని పెంచి, మంచి ఎరువులా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
కోడిగుడ్డు పెంకులు (Eggshells)
కోడిగుడ్డు పెంకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కల వేర్లను బలంగా చేస్తుంది. గుడ్డు పెంకులను బాగా ఎండబెట్టి, పొడి చేసి మొక్క మొదట్లో మట్టిపై చల్లాలి.
Image credits: Pinterest
Telugu
బియ్యం కడిగిన నీళ్లు
బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పోయండి. ఇందులో ఉండే మినరల్స్, పిండి పదార్థాలు మొక్కలకు శక్తినిచ్చి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
Image credits: Getty
Telugu
మీ గార్డెన్‌ను పచ్చగా ఉంచండి
ఈ సింపుల్, సహజమైన పద్ధతులు పాటిస్తే చాలు. మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు లేకుండానే మీ ఇంటి తోటను అందంగా, పచ్చగా మార్చుకోవచ్చు.