Telugu

ఈ సింపుల్ టిప్స్ తో వెల్లుల్లిని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Telugu

పెద్ద సైజు రెబ్బలు

ఇంట్లో ఉన్న వెల్లుల్లి పాయను ఒలిచి, నాటడానికి వీలుగా ఉండే పెద్ద సైజు రెబ్బలను ఎంచుకోవాలి.

Image credits: Getty
Telugu

మట్టి ఎంపిక

నీరు నిలవని మట్టిని ఎంచుకోవాలి. మట్టిలో తగినంత పశువుల ఎరువువేసి బాగా కలపాలి.

Image credits: Getty
Telugu

ఎలా నాటాలంటే..

వెల్లుల్లి రెబ్బ మొనదేలిన భాగం పైకి, చదునైన భాగం కిందికి ఉండేలా మట్టిలో నాటాలి. రెబ్బల మధ్య 4-6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

మట్టితో కప్పితే చాలు..

వెల్లుల్లి రెబ్బలను మరీ లోతుగా నాటకూడదు, మట్టితో కప్పితే చాలు. మంచి సూర్యరశ్మి తగిలే చోట మొక్కలను పెంచాలి. మట్టిలో తేమ ఉండాలి, కానీ నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

పిచ్చి మొక్కలు రాకుండా..

నాటిన తర్వాత, మట్టిపై ఎండుటాకులు లేదా గడ్డి పరచాలి. ఇది మట్టిలో తేమను నిలిపి, కలుపు మొక్కలు పెరగకుండా అడ్డుకుంటుంది.

Image credits: Getty
Telugu

పశువుల ఎరువు

మొక్క పెరిగే దశలో పశువుల ఎరువుతో పాటు, పులియబెట్టిన వేరుశనగ చెక్కను నీటిలో కలిపి పోయాలి. ఇలా చేస్తే వెల్లుల్లి పాయలు పెద్ద సైజులో వస్తాయి.

Image credits: Getty
Telugu

పాడవకుండా ఉండాలంటే..

వెల్లుల్లి కోతకు వచ్చే రెండు వారాల ముందు నుంచి నీళ్లు పోయడం పూర్తిగా ఆపేయాలి. దానివల్ల వెల్లుల్లి ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది.

Image credits: Getty
Telugu

పసుపు రంగులోకి మారినప్పుడు..

మొక్క కింది ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోవడం మొదలైనప్పుడు వెల్లుల్లి చేతికి వచ్చినట్లు అర్థం చేసుకోవాలి.

Image credits: Getty

Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Indoor Plants: ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

Indoor Plants: ఇళ్లు అందంగా కనిపించాలంటే ఈ 7 మొక్కలు పెంచితే చాలు!

మీ బాల్కనీలోనే సొరకాయలు పెంచొచ్చు, ఎలానో తెలుసా?