Plants:బియ్యం కడిగిన నీళ్లలో ఇది కలిపి పోస్తే మొక్కలు వేగంగా పెరుగతాయి
gardening Mar 26 2026
Author: ramya Sridhar Image Credits:chat GPT
Telugu
బెస్ట్ ఎరువు
మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, గులాబీ, మల్లె, మందారం, టొమాటో, క్యారెట్, బీట్‌రూట్, పాలకూర వంటి మొక్కలకు బియ్యం నీటిలో కాఫీ పొడి కలిసి పోస్టే.. మొక్కలు బాగా పెరుగుతాయి.
Image credits: chat GPT
Telugu
ఈ మొక్కలకు వాడకూడదు.
లావెండర్, రోజ్‌మేరీ వంటి మొక్కలకు కాఫీ పొడిని ఎరువుగా వేయకూడదు.
Image credits: pinterest
Telugu
ఆరబెట్టి వాడాలి
వాడిన కాఫీ పొడిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత మొక్క మొదట్లో మట్టిలో తేలికగా కలపాలి.
Image credits: Getty
Telugu
లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా..
వాడిన కాఫీ పొడిని ఒక మగ్గు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి, దానికి మరికొన్ని నీళ్లు కలపాలి. అది లేత టీ రంగులోకి వచ్చాక మొక్కలకు పోయాలి.
Image credits: Getty
Telugu
నీటి మోతాదు ఎంత?
ఒక చెంచా కాఫీ పొడికి సుమారు అర లీటరు నుంచి ఒక లీటరు నీళ్లు కలిపితే సరిపోతుంది.
Image credits: Pinteresr
Telugu
వాడిన పొడే ఉత్తమం
ఫ్రెష్ కాఫీ పొడి కంటే, ఒకసారి కాఫీ చేశాక మిగిలిన పొడి మొక్కలకు చాలా సురక్షితం.
Image credits: Getty
Telugu
పురుగుల నివారణకు..
మొక్క చుట్టూ కాఫీ పొడి చల్లడం వల్ల నత్తలు, ఇతర కీటకాలు దగ్గరకు రావు.
Image credits: our own
Telugu
అతిగా వాడొద్దు
కాఫీ పొడిని మరీ ఎక్కువగా వాడితే ఆకులు పసుపు రంగులోకి మారొచ్చు. మట్టి పరిమాణాన్ని బట్టి కొద్దిగా మాత్రమే వాడాలి.
Image credits: our own
Telugu
ఇలా చేయొద్దు
కాఫీ పొడిని నేరుగా మొక్క కాండంపై లేదా ఆకులపై వేయకూడదు. మొదలుకు కొంచెం దూరంగా మట్టిపై చల్లాలి.
Image credits: pexels
Telugu
వేగంగా పెరుగుతాయి
మీకు మొక్కలకు బియ్యం కడిగిన నీళ్లు (రైస్ వాటర్) పోసే అలవాటు ఉంటే, దానికి కొద్దిగా ఈ కాఫీ పొడి కలిపి పోయండి. మొక్కలు మరింత వేగంగా, పచ్చగా పెరుగుతాయి.
Image credits: unsplash
Telugu
కొలత ఇలా ఉండాలి
మీరు బియ్యం కడిగిన నీటిని వాడుతుంటే, ఒక లీటరు నీటికి ఒక చెంచా కాఫీ పొడి కలపడం సరైన కొలత.