మీ ఆఫీస్ టేబుల్ కు గ్రీన్ టచ్ కావాలా? ఈ మొక్కలు సరైన ఎంపిక!
gardening Jul 27 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
స్నేక్ ప్లాంట్
గాలిని శుద్ధి చేయడానికి, సానుకూల శక్తిని పొందడానికి స్నేక్ ప్లాంట్ ఓ బెస్ట్ ఆప్షన్. ఇది తక్కువ సంరక్షణతో ఆఫీస్ టేబుల్‌పై సులభంగా పెంచుకోవచ్చు. పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
కలబంద
గాలిని శుద్ధిచేసే కలబంద మొక్క మీ ఆఫీస్ టేబుల్‌ను అందంగా మార్చుతుంది. తక్కువ జాగ్రత్తతో సులభంగా పెంచుకోవచ్చు.
Image credits: Getty
Telugu
జిజి ప్లాంట్
తక్కువ సంరక్షణతో సులభంగా పెరిగే మొక్క జిజి ప్లాంట్. దీని ప్రకాశవంతమైన ఆకులు ఆఫీస్ టెబుల్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
Image credits: Getty
Telugu
ఫిలోడెండ్రాన్
ఫిలోడెండ్రాన్ ఏ వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతుంది. గాలిని శుద్ధి చేస్తూ, అందంగా పెరిగే ఈ మొక్క ఆఫీస్‌కి హరిత వాతావరణం అందిస్తుంది.
Image credits: Getty
Telugu
పీస్ లిల్లీ
మీ ఆఫీస్ టేబుల్ ను అందంగా మార్చే మిని ప్లాంట్ పీస్ లిల్లీ. దీని తెల్లని పువ్వులు శాంతిని, శుభతనాన్ని సూచిస్తూ శోభను పెంచుతాయి.
Image credits: Getty
Telugu
మనీ ప్లాంట్
అందరికీ సుపరిచితమైన మొక్క మనీ ప్లాంట్. ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క. తక్కువ నీటితోనూ, తక్కువ వెలుతురులోనూ పెరిగే ఈ మొక్క శుభఫలితాలకు, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు.
Image credits: Getty
Telugu
స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ ఆఫీస్ ప్రదేశంలో సానుకూల శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఈ మొక్క ఆఫీస్ డెస్క్ పై హరితవాతావరణాన్ని సృష్టిస్తుంది.