Telugu

మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు.. దెబ్బకి కీటకాలు పరార్..!

Telugu

రోజ్‌మేరీ (Rosemary)

ఇతర మొక్కలతో పోల్చితే రోజ్మేరీ ఒక ప్రత్యేకమైన ఔషధ మొక్క. దీని ఘాటైన వాసన కీటకాలకు చీరాకు పుట్టిస్తుంది. అంతేగాక, వంటకాలకు రుచి, వాసన చేకూర్చుతుంది. 

Image credits: Getty
Telugu

వాము

వాము మొక్క సులభంగా పెరిగే ఔషధ మొక్క. ఇది కేవలం వంటగదిలో కాదు, తోటలోనూ ఉపయోగపడుతుంది. దాని సుగంధం వల్ల కీటకాలను దూరంగా ఉంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

తులసి

తులసి శక్తివంతమైన ఔషధ మొక్క. ఈ మొక్క తోటలోని కీటకాలను దూరం చేయడంలో సహాయపడుతుంది. తులసి వాసన కీటకాలను తినే సహజ శత్రువులను ఆకర్షించి, కీటకాల సంఖ్యను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

సీమ మల్లి

కీటకాల బెడదను చెక్ పెట్టడానికి సీమ మల్లి మంచి పరిష్కారం. కొత్తిమీర లాగా కనిపించినప్పటికీ ఇది వేరే మొక్క. ఈ మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

లావెండర్

లావెండర్.. మంచి సువాసనతో కూడిన ఈ మొక్క ఊదా రంగు పువ్వులతో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, దాని వాసన మిచ్చిడ్స్, ఈగలు, మరికొన్ని కీటకాలను తరిమికొడుతుంది. 

Image credits: Getty
Telugu

సేజ్ ప్లాంట్

దీనిని సాల్వియా అని కూడా పిలుస్తారు. దీని ఘాటైన వాసన కీటకాలను దూరంగా ఉంచుతుంది. తోటలో ఈ ఔషధ మొక్కను పెంచడం వల్ల కీటకాల నియంత్రణతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

Image credits: Getty
Telugu

పుదీనా

ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క. ఈ మొక్క నుంచి వచ్చే వాసనను కీటకాలు తట్టుకోలేవు. తోటలో లేదా ఇంటి చుట్టూ పుదీనాను పెంచడం వల్ల దోమలు, చీమలు, ఇతర కీటకాల బారి నుంచి రక్షణ లభిస్తుంది.

Image credits: Getty

Oregano: దివ్య ఔషధ మూలిక ఒరెగానో.. ఈ మొక్కను పెరట్లో పెంచుకోండిలా..

Indoor Plants: ఇంట్లో ఈజీగా పెరిగే మొక్కలు ఇవే..!

Indoor Plants: ఇండోర్ ప్లాంట్స్ ఎండిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Indoor Plants: ఇల్లు అందంగా ఉండాలంటే.. ఈ ప్లాంట్స్ ఉండాల్సిందే!