బరువు తగ్గాలనుకునేవారు ఆలుగడ్డలను మాత్రం తినకూడదు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో షుగర్ ను పెంచుతాయి. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు.
బఠానీలు ఆరోగ్యానికి మంచివి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ లతో పాటుగా కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం వీటిని ఎక్కువగా తినకండి.
మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మాత్రం తినొద్దు. ఎందుకంటే వీటిలో బరువును పెంచే కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఆకు కూరలను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి మీరు క్యాబేజీని తినొచ్చు. దీనిలో కరిగే, కరగని ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.
బరువు తగ్గడానికి బ్రోకలీ బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
కాలీఫ్లవర్ ను కూడా మీరు వెయిట్ లాస్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఆ కూరగాయను తింటే మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గడానికి దీనిని తినొచ్చు.