జీర్ణ సమస్యలు ఉన్నవారు చిలగడదుంపలను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ గ్యాస్, అజీర్థి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది.
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, ఇతర మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు చిలగడదుంపలను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే ఆక్సలేట్, పొటాషియం కిడ్నీ సమస్యలను మరింత పెంచుతుంది.
చిలగడదుంపల్లో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని షుగర్ ఉన్నవారు చాలా తక్కువగా తినాలి. లేదంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
రక్తపోటు తక్కువగా ఉన్నవారు కూడా చిలగడదుంపలను తినకూడదు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీని మరింత తగ్గిస్తుంది.
చిలగడదుంపల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బరువు తగ్గాలనుకునేవారు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి బరువును మరింత పెంచుతాయి.
చిలగడదుంపలో యాంటీ-థైరాయిడ్ లక్షణాలుంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే వీళ్లు కూడా తినకూడదు.
చిలగడదుంపలకు అలెర్జీ ఉన్నవారు కూడా వీటిని తినకూడదు. ఒకవేళ తింటే చర్మం ఎర్రగా అవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దురవ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
చిలగడదుంపలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ గా మారుతుంది. దీనిని గనుక ఎక్కువగా తింటే వాంతులు, తలనొప్పి, కాలెయ సమస్యలు వస్తాయి.