లాక్టోస్ అసహనం ఉన్నవారు పనీర్ ను ఎక్కువగా తింటే కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పనీర్ ను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే దీనిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి.
పనీర్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
షాపుల్లో కొనే పనీర్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే అధిక రక్తపోటు సమస్య వస్తుంది.
మీరు పనీర్ ను ఎక్కువగా తింటే మాత్రం ఇతర ఆహారాల నుంచి పొందే విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయి. దీనివల్ల మీరు బలహీనంగా అవుతారు.
కొంతమందికి పాలకు అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారు పనీర్ ను ఎక్కువగా తింటే దురద, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు వస్తాయి.
ఇప్పుడు అన్నీ కల్తీ అవుతున్నాయి. అయితే మీరు కల్తీ పనీర్ ను గనుక తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అవయవ నష్టం కూడా జరగొచ్చు.