Food
విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నారింజ పండ్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బచ్చటికూర వంటి ఆకుకూరలను తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉండే సాల్మన్ వంటి చేపలను తిన్నా కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపు బాగుంటుంది.
బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్లను తింటే కూడా కంటిచూపు బాగుంటుంది.
గుడ్లలో విటమిన్ ఇ, విటమిన్ సి, లుటిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
విటమిన్ ఎ పుష్కలంగా ఉండే చిలగడదుంపను తింటే కూడా కళ్లు బాగా కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
బాదం పప్పులో విటమిన్ ఇ, విటమిన్ సి, జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.