Food
ఫైబర్ పుష్కలంగా ఉండి, కేలరీలు తక్కువగా ఉండే ఆపిల్స్ ను తింటే కూడా మీరు బరువు తగ్గుతారు. ఈ పండ్లు ఆకలిని తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
బెర్రీల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ బెర్రీలు బరువు తగ్గడానికి మీకు ఎంతగానో సహాయపడతాయి.
పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తిన్నా మీరు బరువు తగ్గుతారు.
నారింజలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు తింటే ఆకలి తగ్గి బరువు తగ్గుతారు.
కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే పియరీ పండ్లు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
కివీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
పీచెస్ కూడా బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఫైబర్, పెక్టిన్ ఎక్కువగా ఉండే జామపండు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.