Food

డీహైడ్రేషన్

పుచ్చకాయలో 95% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను తింటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 
 

Image credits: Getty

రక్తపోటు

పుచ్చకాయలో  అమైనో యాసిడ్ 'సిట్రులిన్'  పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

Image credits: Getty

జీర్ణం

పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పుచ్చకాయను మీరు రెగ్యులర్ గా తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

పుచ్చకాయలో మన శరీరానికి మేలు చేసే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజూ తింటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయను తింటే మీ ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

సలహా

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చాలి. 

Image credits: Getty
Find Next One