Food
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది వర్షాకాలంలో అంటువ్యాధులు, మంటతో పోరాడటానికి సహాయపడుతుంది,
దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్ లు, బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది గొంతు నొప్పి, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, ఫ్లూ రాకుండా కాపాడుతాయి.
పసుపులో శక్తివంతమైన రోగనిరోధక శక్తి లక్షణాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, మంటను తగ్గించడానికి, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
నల్ల మిరియాలు పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. దీనిలోని పైపెరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మెంతుల్లో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి.
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యూజెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా మంటను తగ్గించడానికి సహాయపడతాయి.