Food
మందార టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ బీపీ అదుపులో ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ జ్యూస్ ను తాగితే కూడా మీ రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
బీట్ రూట్ జ్యూస్ బీపీ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ రక్త నాళాలను సడలించి, బీపీని తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే స్ట్రాబెర్రీ జ్యూస్ ను తాగితే కూడా అధిక రక్తపోటును తగ్గుతుంది.
100 గ్రాముల టమాటాల్లో 237 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అలాగే లైకోపీన్ కూడా ఉంటుంది. ఇవి బీపీని తగ్గించడానికి సహాయపడతాయి.
విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉండే క్యారెట్ జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది.
విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ను తాగితే కూడా బీపీ కంట్రోల్ అవుతుంది.
ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చాలి.