Food

నిద్ర లేమి

నేడు చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ నిద్రలేమి సమస్యను తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. 

Image credits: Getty

నిద్రకు సహాయపడే ఆహారాలు

ఫుడ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం..  కొన్ని ఫుడ్స్ రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

బాదం పప్పు

బాదం పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి తింటే మీకు రాత్రిపూట కంటినిండా నిద్రపడుతుంది. 

Image credits: Getty

కివి పండు

కివి కూడా నిద్ర రావడానికి సహాయపడుతుంది. సెరోటోనిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కివి తొందరగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

అరటిపండు

పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే అరటిపండ్లను తింటే  మీకు తక్షణ ఎనర్జీ రావడంతో పాటుగా రాత్రిళ్లు నిద్ర కూడా బాగా వస్తుంది. 

Image credits: Getty

పాలు

రాత్రిపూట ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మీకు నిద్రపట్టడానికి సహాయపడుతుంది. 

 

Image credits: Getty

వాల్ నట్స్

మెలటోనిన్ పుష్కలంగా ఉండే వాట్ నట్స్ ను తింటే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

 

Image credits: Getty

యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్ చేసే గింజలు ఇవి..

సబ్జా గింజలు మనకు ఎలా ఉపయోగపడతాయి?

థైరాయిడ్ ఉన్నవారు తినాల్సిన ఆహారాలు ఇవి..!

కిడ్నీ స్టోన్స్ రాకుండా చేసే ఆహారాలు ఇవి..!