Telugu

Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి

Telugu

నిమ్మకాయలు ఎలా స్టోర్ చేయాలి?

ఫ్రిజ్ లో పెట్టినా నిమ్మకాయలు ఎండిపోతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో  నెలల తరబడి నిమ్మకాయలు తాజాగా ఉంటాయి. 

Image credits: AI Meta
Telugu

చిట్కా 1: వంట నూనెతో...

నిమ్మకాయలను శుభ్రంగా తుడిచి, వాటిపై మూడు నాలుగు చుక్కల వంట నూనె రాయాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే నిమ్మకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Image credits: AI Meta
Telugu

చిట్కా 2: నీళ్లలో నానబెట్టి...

ఒక గాజు సీసా తీసుకుని, అందులో సగం వరకు నీళ్లు నింపాలి. ఆ తర్వాత నిమ్మకాయలను ఆ నీటిలో వేసి, మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇలా చేసినా అవి తాజాగా ఉంటాయి.

Image credits: AI Meta
Telugu

చిట్కా 3: న్యూస్‌పేపర్‌తో చుట్టి...

ప్రతి నిమ్మకాయను విడివిడిగా న్యూస్‌పేపర్‌లో చుట్టి నిల్వ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు దాదాపు 15 రోజుల వరకు ఎండిపోకుండా తాజాగా ఉంటాయి.

Image credits: AI Meta
Telugu

చిట్కా 4: రసం తీసి దాచుకుంటే...

ఇంకొంతమంది నిమ్మకాయల నుంచి రసం తీసి, గాలి చొరబడని డబ్బాలో లేదా ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

Image credits: AI Meta

Ginger Water: ప్రతిరోజూ అల్లం నీరు తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే

Boiling Eggs: ఇలా గుడ్లు ఉడికిస్తే..పెంకు పర్ఫెక్ట్ గా వస్తుంది

Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి

Cumin Water: రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?