ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్దకం. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు.
డీహైడ్రేషన్, ఫైబర్ లోపం, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని మందులు తీసుకోవడం వల్ల మలబద్దకం రావచ్చు.
మలబద్ధకాన్ని నివారించడానికి తినాల్సిన ఐదు ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
కివిలో ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. అందుకే మలబద్ధకాన్ని నివారించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.
ఆపిల్ జ్యూస్‌లో సార్బిటాల్ అనే సహజ పోషకం ఉండటం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి ఇది సహాయపడుతుంది.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలు మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణ సమస్యలను దూరం చేయడానికి సహాయపడతాయి.
ఒక అరటిపండులో దాదాపు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందుకే ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
చిలగడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే మలబద్ధకాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది.
ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియకుండా ఇలా చేయండి
ఈ కూరగాయలు పచ్చిగా తింటేనే ఆరోగ్యం
పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
ఇడ్లీ, దోశ పిండి పుల్లగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?